సోమవారం 30 మార్చి 2020
National - Mar 13, 2020 , 15:51:54

ఒక్కటైనా కచ్చితంగా గెలుస్తామని చెప్పండి చూద్దాం..!

ఒక్కటైనా  కచ్చితంగా గెలుస్తామని చెప్పండి చూద్దాం..!

అమరావతి:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ఆంధ్రప్రదేశ్‌లో   స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా  అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని  ఆరోపణలు చేయడంతో     విపక్షాల ఆరోపణలకు  విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా  గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు.

 ఎంతకైనా దిగజారతాడు చంద్రబాబు. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కులాలు అంటగడతాడు. అధికార పార్టీ సానుభూతిపరులని ముద్ర వేస్తాడు. ఎల్లో మీడియా కమ్మగా సన్నాయి మోగిస్తుంది. ప్రజలు నమ్ముతున్నారని భ్రమ పడతాడు. ఆఖరున నేనెందుకు ఓడానో అర్థం కావడం లేదని శోకాలు పెడతాడు.

ఎలక్షన్లలో అక్రమాలు, అరాచకాల గురించి చంద్రబాబు సుద్దులు చెబుతున్నాడు. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా?  మాపార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను బెదిరించి జెడ్పీలను, ఎమ్మెల్సీ పదవులను లాక్కుంది ఎవరు? గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇప్పుడు బురద చల్లుతున్నావు.

పొత్తులకు కూడా కొన్ని సైద్ధాంతిక విలువలు, నియమాలుంటాయి. బీజేపీతో  అంటకాగుతున్న జనసేనతో తెలుగుదేశం సీట్ల సర్ధుబాటు చేసుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారు. అభ్యర్థులు లేని చోటల్లా జనసేనకు వదిలేశామని చెప్పుకుంటున్నారట. ఒక్క మండలమైనా కచ్చితంగా గెలుస్తామని చెప్పండి చూద్దామని విజయ సాయిరెడ్డి సవాల్‌ చేశారు. 


logo