శుక్రవారం 03 జూలై 2020
National - Apr 11, 2020 , 18:06:18

వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థలు శాశ్వతం

వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థలు శాశ్వతం

అమరావతి: న్యాయకోవిదుడు ఎస్‌ఈసీ స్థానంలో ఉంటే చట్టాలను పటిష్టంగా అమలు చేయగలరని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు  అన్నారు. వ్యవస్థను బలోపేతం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.

ఎమ్మెల్యే అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎస్‌ఈసీగా నియమితులైన కనగరాజ్‌ సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. 9 ఏండ్లు జడ్జిగా కనగరాజ్‌ కీలక తీర్పులు ఇచ్చారు. వ్యవస్థలపై చంద్రబాబుకు గౌరవం లేదు. వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థలు శాశ్వతం. కరోనా నియంత్రణకు సీఎం జగన్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కరోనాను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అంబటి విమర్శించారు. 

 


logo