బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 14:57:31

వైఎస్‌ వివేకా హత్య కేసు.. సీబీఐకి అప్పగింత

వైఎస్‌ వివేకా హత్య కేసు.. సీబీఐకి అప్పగింత

అమరావతి : వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది కోర్టు. భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత పిటిషన్లను కోర్టు విచారించింది. మొత్తం నాలుగు పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హత్య జరిగి ఏడాది అవుతున్నా దర్యాప్తులో పురోగతి లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. సీఎం జగన్‌ పిటిషన్‌ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని కోర్టు చెప్పింది. కడప జిల్లాలోని పులివెందుల నుంచి దర్యాప్తు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సిట్‌ విచారణ జరిపినా ఏమీ తేల్చలేకపోయిందని కోర్టు పేర్కొంది. కేసులో అంతర్‌రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 2019, మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. 


logo