ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 18:55:54

వడ్డీలేని, తక్కువ వడ్డీ ఉండే దీర్ఘకాలిక రుణాలివ్వాలి

వడ్డీలేని, తక్కువ వడ్డీ ఉండే దీర్ఘకాలిక రుణాలివ్వాలి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు సమగ్రసర్వే నిర్వహించామని, కరోనాను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమని ముఖ్యమంత్రి జగన్‌..ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు.  ప్రధాని మోదీ సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌..మోదీతో మాట్లాడారు.

'కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనే వరకు వైరస్‌తో మనం ముందుకు సాగాల్సి ఉందన్న విషయాన్ని అవగాహన కల్పించాలి. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యమైనవి. ఆస్సత్రులు, ఆరోగ్య మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.16వేల కోట్లు ఖర్చు అవుతోంది. వడ్డీలేని, తక్కువ వడ్డీ ఉండే దీర్ఘకాలిక రుణాలివ్వాలి. ప్రజారోగ్యానికి ఇచ్చే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలి. ఎంఎస్‌ఎంఈలకు ఆరునెలల కాలానికి వడ్డీలు మాఫీ చేయాలని' జగన్‌ కోరారు.  


logo