టీమిండియాను చూసి నేర్చుకోండి

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఇండియన్ క్రికెట్ టీమ్ సాధించిన చారిత్రక విజయం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నో సవాళ్ల మధ్య అనుభవం లేని టీమిండియా చరిత్ర సృష్టించిందని, ఇండియా కూడా ఇలాంటి స్ఫూర్తితోనే ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశ పరిస్థితిని, అనుభవం లేని ఇండియన్ టీమ్ గెలిచిన తీరును పోలుస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మోదీ శుక్రవారం ప్రసంగించారు.
ఎన్నో సవాళ్లు ఎదురైనా..
మన క్రికెట్ టీమ్‌నే ఉదాహరణగా తీసుకోండి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. మనం దారుణంగా ఓడిపోయాం. అయినా కఠిన సవాళ్లను ఎదురిస్తూ మళ్లీ విజయం సాధించాం. వాళ్లకు అనుభవం లేదు. అయినా ఆత్మవిశ్వాసానికి మాత్రం కొదవ లేదు. చివరికి వాళ్లే చరిత్ర సృష్టించారు. క్రికెట్ సక్సెస్ మనకు పెద్ద జీవిత పాఠం. మనం మన మైండ్‌సెట్‌ను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంచుకోవాలి అని ప్రధాని అన్నారు. సానుకూల ఫలితాలు రావాలంటే సానుకూల మైండ్‌సెట్‌ను కలిగి ఉండాలని, ఆత్మనిర్భర్ భారత్ సారాంశం అదే అని మోదీ స్పష్టం చేశారు. కరో వచ్చిన సమయంలో ప్రజలు కూడా చాలా భయపడ్డారు. కానీ దేశం ఆ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నది. మేడిన్ ఇండియా పరిష్కారాలతోనే కొవిడ్‌తో పోరాడాము అని మోదీ అన్నారు. మన సైంటిస్టులపై మనం చూపిన విశ్వాసం వల్లే వ్యాక్సిన్లు సాధ్యమయ్యాయని చెప్పారు.
తాజావార్తలు
- కోరుట్లలో కరోనా కలకలం
- మూడో టెస్ట్ ఎఫెక్ట్.. పింక్ బాల్ మారుతోంది!
- కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఫుట్‌బాల్ లెజండ్ పీలే
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు