సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 14:38:23

చాక్లెట్ చూపించి బిడ్డ‌ను కాజేయాల‌నుకున్నోళ్ల‌కి చుక్క‌లు చూపించిన‌ త‌ల్లి

చాక్లెట్ చూపించి బిడ్డ‌ను కాజేయాల‌నుకున్నోళ్ల‌కి చుక్క‌లు చూపించిన‌ త‌ల్లి

ఊహ తెలియ‌ని పిల్ల‌ల‌కు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపి ఎత్తుకెల్లిపోయే సంఘ‌ట‌న‌లు ఇంకా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఢిల్లీలోని శ‌క‌ర్‌పూర్‌లో ఇద్ద‌రు దుండ‌గులు నాలుగేండ్ల ప‌సిబిడ్డ‌కు చాక్లెట్ చూపించి బాబుని అప‌హ‌రించాల‌నుకున్నారు. ఇంత‌లో ఆ త‌ల్లి అల‌ర్ట్ అయి బాబుని చేతిలోకి లాక్కుని ఆ ఇద్ద‌రి అంతు చూసింది.

30 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో బైక్‌మీద వెనుక కూర్చుని ఆ వ్య‌క్తి త‌ల్లి ప‌ట్టుకొని నాలుగు త‌గిలివ్వ‌బోయింది. ఇంత‌లో అత‌ను త‌ప్పించుకొని పారిపోయాడు. బైక్ న‌డిపే అత‌ను ఆమెను చూసి హ‌డ‌లిపోయి తొంద‌ర తొంద‌ర‌గా బైక్ స్టార్ట్ చేసి అక్క‌డ ఉంచి ఎస్కేప్ అయ్యాడు. లేదంటే ఆ త‌ల్లి చేతిలో వీరిద్ద‌రు ఏమ‌య్యేవారో.. బైక్ నెంబ‌ర్ ఆదారంగా ఆ దుండ‌గుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీకెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోనే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతున్న‌ది. ఈ త‌ల్లి ధైర్య సాహ‌సాల‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. ఇలాంటి త‌ల్లి ఉంటే ఏ బిడ్డ‌కు హాని జ‌ర‌గ‌దు అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 


logo