అర్ధరాత్రి.. రోడ్డంతా నిర్మానుష్యం.. మీరు ఒక్కరే రోడ్డుపై వెళ్తున్నారు ! అప్పుడే ఓ కుక్కల గుంపు కరిచేద్దాం అన్నట్టుగా మిమ్మల్ని రౌండప్ చేస్తే ఏం చేస్తారు? చేతిలో ఉన్న వస్తువుతోనో.. లేదా దగ్గరలో దొరికిన రాయితోనో ఆ కుక్కలను బెదిరిస్తారు ! లేదా బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి పరుగుపెడతారు.. కానీ ఓ యువతి మాత్రం విభిన్నంగా ట్రై చేసింది. కాపుగాసి కరిచేద్దాం అన్నట్టుగా చూస్తున్న ఆ శునకాల ముందు డ్యాన్స్ చేసి వాటిని అయోమయంలో పడేసింది. ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
ఈ వీడియోపై నెటిజిన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కరవడానికి వెంటపడుతున్న కుక్కలకు భయపడకుండా రోడ్డు మీద డ్యాన్స్ చేసిన ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరేమో రోడ్డు మీద కుక్కల ముందు పిచ్చి వేశాలేంటని మరికొందరు విమర్శిస్తున్నారు.