గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 09, 2020 , 16:15:45

పొలంలో ప‌నిచేస్తున్న రైతు కాల్చివేత‌

పొలంలో ప‌నిచేస్తున్న రైతు కాల్చివేత‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. క‌న్నౌజ్ జిల్లా స‌ద‌ర్ ఏరియాలోని తాహ్సిపూర్ గ్రామంలో ఓ రైతును దుండ‌గులు కాల్చిచంపారు. చంద్ర‌కిశోర్ రాజ్‌పుత్‌ అనే 23 ఏండ్ల రైతు త‌న పొలంలో ప‌నిచేస్తుండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జ‌రిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో కిశోర్ రాజ్‌పుత్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హ‌త్య‌కు సంబంధించిన‌ స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు. కాగా, క‌న్నౌజ్ ఎంపీ సుబ్ర‌త్ పాఠ‌క్ బాధిత కుటుంబాన్ని సంద‌ర్శించి ప‌రామ‌ర్శించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.