సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 20:29:18

క‌రోనా మీద జోకులేశావ్‌.. ఇప్పుడు నీకే వ‌చ్చింది: క‌మ‌ల్‌నాథ్‌

క‌రోనా మీద జోకులేశావ్‌.. ఇప్పుడు నీకే వ‌చ్చింది: క‌మ‌ల్‌నాథ్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంపై ఆ రాష్ట్ర‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ విచారం వ్యక్తంచేశారు. శివ‌రాజ్‌సింగ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ మేర‌కు క‌మ‌ల్‌నాథ్ శ‌నివారం ట్వీట్ చేశారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నే వార్త తెలియ‌గానే చాలా బాధపడ్డానని ఆయ‌న ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. 

శివరాజ్ జీ మీకు కరోనా పాజిటివ్ అని తెలిసి నేను చాలా బాధపడ్డాను. మీరు అత్యంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కానీ క‌రోనా క‌ట్ట‌డికి మేం తీవ్రంగా శ్రమిస్తున్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి నాటకం ఆడుతున్నామని ఎద్దేవా చేశారు. బహుశా మీరు క‌రోనా నిబంధనలు పాటించి ఉంటే దాని గురించి జోకులు వేయకుండా ఉండి ఉంటే నేడు సురక్షితంగా ఉండేవారు అని కమల్‌నాథ్ ట్వీట్ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo