ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 13:19:02

చిన్న‌చిన్న జాగ్ర‌త్త‌ల‌తో క‌రోనాను దూరం పెట్టొచ్చు: ఆరోగ్య‌మంత్రి హర్ష‌వ‌ర్ద‌న్‌

చిన్న‌చిన్న జాగ్ర‌త్త‌ల‌తో క‌రోనాను దూరం పెట్టొచ్చు: ఆరోగ్య‌మంత్రి హర్ష‌వ‌ర్ద‌న్‌

న్యూఢిల్లీ: చిన్నచిన్న స్వీయ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఎవ‌రికివారు కరోనా మ‌హ‌మ్మారిని దూరం పెట్ట‌వ‌చ్చ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అన్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా మాస్కులు ధరించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం, త‌ర‌చూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం లాంటి చిన్న‌చిన్న జాగ్ర‌త్త‌ల‌ను స‌రిగ్గా ఆచ‌రిస్తే క‌రోనా మ‌హ‌మ్మారి ద‌రిచేర‌ద‌ని మంత్రి చెప్పారు. స‌రైన నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను పాటించ‌డం, ఇత‌రులు కూడా నియంత్ర‌ణ‌లు పాటించేలా ప్రేరేపించ‌డం ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని 90 నుంచి 99 శాతం వ‌ర‌కు క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

అదేవిధంగా 2020-21 ఏడాదిలో సెంట్ర‌ల్‌పూల్ ఎంబీబీఎస్‌, బీడీస్ సీట్లకు ఎంపిక‌, నామినేష‌న్‌ల కోసం వార్డ్స్ ఆఫ్ కొవిడ్ వారియ‌ర్స్ అనే పేరుతో కొత్త కేట‌గిరీని ప్రవేశ‌పెట్టారు. ఈ కొత్త కేట‌గిరీకి కేంద్ర ఆరోగ్య‌శాఖ ఆమోదం తెలిపింది. నిస్వార్థంగా సేవ‌లందించిన కొవిడ్ వారియర్స్ త్యాగాల‌కు గౌర‌వ‌సూచ‌కంగా ఆరోగ్య‌శాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని హ‌ర్ష‌వ‌ర్ద‌న్ పేర్కొన్నారు. ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.