శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 19:29:17

శానిటైజర్‌ పెన్‌.. రాస్తుంది.. శానిటైజ్‌ చేస్తుంది..!

శానిటైజర్‌ పెన్‌.. రాస్తుంది.. శానిటైజ్‌ చేస్తుంది..!

లక్నో: కొవిడ్‌ నేపథ్యంలో శానిటైజర్ల వినియోగం పెరిగిపోయింది. పలు కంపెనీలు వివిధ రకాల శానిటైజర్లను తయారుచేసి, మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. పెన్‌ శానిటైజర్‌ను తయారుచేసి, మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ పెన్‌ రాయడానికేగాక మన చేతులను శానిటైజ్‌ చేసుకునేందుకు కూడా ఉపయోగించవచ్చు. 

‘ఇంతకుముందు శానిటైజర్లు ఎవరూ వాడేవారు కాదు. కానీ ఇప్పుడది అత్యవసర వస్తువైపోయింది. ఒక్కొక్కరూ ఒక్కోరకం శానిటైజర్‌ను ఇష్టపడుతారు. వారి అవసరాలకనుగుణంగా మేం వినూత్నంగా వీటిని తయారుచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే శానిటైజర్‌ పెన్‌ను రూపొందించాం. దీన్ని విద్యార్థులు స్కూల్‌కు, ఉద్యోగస్తులు ఆఫీస్‌కు జేబుకు పెట్టుకొని వెళ్లొచ్చు. దీన్ని రాయడానికి, చేతులను శానిటైజ్‌ చేసుకునేందుకు ఉపయోగించవచ్చు.’ అని మెడిషీల్డ్‌ హెల్త్‌కేర్‌ ఎండీ డాక్టర్‌ ఫరాజ్‌ హసన్‌ పేర్కొన్నారు. అలాగే, మరోరకం శానిటైజర్‌ను తయారుచేశామని, ఇది రాయదుగాని, చేతులను శానిటైజ్‌ చేస్తుందని, మూడు గంటల వరకు ప్రభావం చూపిస్తుందని వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo