శనివారం 04 జూలై 2020
National - Jun 27, 2020 , 01:39:40

యోగి సర్కార్‌పై ప్రధాని ప్రశంసలు

యోగి సర్కార్‌పై ప్రధాని ప్రశంసలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ప్రధాని మోదీ మాత్రం రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. వైరస్‌ నియంత్రణకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని పేర్కొన్నారు. యోగి చర్యల కారణంగా యూపీలో 85 వేల మంది ప్రాణాలు దక్కాయని చెప్పారు. సొంత రాష్ర్టాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఆత్మనిర్భర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ పథకాన్ని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కాగా, యూపీలో కరోనా కేసులు 20వేలు దాటాయి.


logo