బుధవారం 15 జూలై 2020
National - Jun 30, 2020 , 18:41:32

ఉచిత రేషన్‌ను 5 నెలలకు పెంచడం హర్షణీయం : సీఎం యోగి

ఉచిత రేషన్‌ను 5 నెలలకు పెంచడం హర్షణీయం : సీఎం యోగి

ఉత్తర్‌ప్రదేశ్‌ : ప్రధానమంత్రి పేదలకు ఉచితరేషన్‌ను 5నెలలకు పెంచడం హర్షణీయమని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. రాబోయే రోజుల్లో వచ్చే పండుగలను దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

అదేవిధంగా వలసకూలీల కోసం ప్రధాని ప్రవేశపెట్టిన వన్‌నేషన్.. వన్‌రేషన్‌ పేదలకు ఉపయోగపడుతుందని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని సూచించినట్లుగాను ప్రజలందరు భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సీఎం యోగి కోరారు.


logo