ఆదివారం 12 జూలై 2020
National - Jun 23, 2020 , 18:25:22

ఠాణాలు, దవాఖానలు, జైళ్లలో కొవిడ్‌ హెల్ప్‌డెస్క్‌లు : యూపీ సీఎం

ఠాణాలు, దవాఖానలు, జైళ్లలో కొవిడ్‌ హెల్ప్‌డెస్క్‌లు : యూపీ సీఎం

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతి పోలీస్‌స్టేషన్‌, దవాఖానాలు, జైళ్లలో కొవిడ్‌ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్ప్‌డెస్క్‌లను నిర్వహించాలని, అదే జాబితాను అడ్మినిష్ట్రేషన్‌కు  అందించాలని కోరారు. రాష్ట్రంలో రోజుకు 20వేల వరకు శాంపిళ్లను పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం  నాటికి 18, 322 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,152 మంది చికిత్స పొందుతుండగా, 11,601 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ప్రభావంతో ఇప్పటి వరకు 569 మంది మృతి చెందారు. 


logo