సోమవారం 06 జూలై 2020
National - Jun 27, 2020 , 14:46:29

విద్యార్థులకు యూపీ సీఎం అభినందన

విద్యార్థులకు యూపీ సీఎం అభినందన

లక్నో : ఉత్తరప్రదేశ్‌ మాధ్యమికా శిక్షా పరిషత్‌ (యూపీఎంఎస్‌పీ) నిర్వహించిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఎం యోగి ఆధిత్యనాథ్‌ శనివారం అభినందించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు సకాలంలో నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత పాఠశాలలో 83.31 శాతం, ఇంటర్మీడియట్‌లో 74.63 ఉత్తీర్ణత శాతం నమోదయ్యాయని సీఎం వివరించారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం దినేశ్‌శర్మ యూపీఎంఎస్‌పీ అధికారులతో కలిసి రాష్ట్ర బోర్డుల పదో తరగతి, 12వ తరగతి ఫలితాలను ఇవాళ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.లక్ష నగదు, ల్యాప్‌టాప్, వారి ఇళ్లకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.


logo