శుక్రవారం 29 మే 2020
National - Apr 01, 2020 , 00:35:07

యోగనిద్రతో ఒత్తిడి దూరం

యోగనిద్రతో ఒత్తిడి దూరం

  • ట్విట్టర్‌లో వీడియోను షేర్‌ చేసిన ప్రధాని మోదీ 
  • అద్భుతమంటూ ఇవాంక ట్రంప్‌ ప్రశంసలు 

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇంటి దగ్గరే ఉంటూ ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ప్రధాని మోదీ యోగాసనాల వీడియోను మంగళవారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘నాకెప్పుడు సమయం దొరికినా.. వారానికి ఒకటి లేదా రెండుసార్లు యోగానిద్రను ఆచరిస్తాను’ అని పేర్కొన్నారు. యోగా నిద్ర వల్ల ఒత్తిడి దూరమవుతుందని, మనసుకు విశ్రాంతి లభిస్తుందని, ఆందోళన తగ్గుతుందని వివరించారు. లాక్‌డౌన్‌ సమయంలో మీరు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేస్తారని ఆదివారం జరిగిన ‘మన్‌కీబాత్‌' కార్యక్రమంలో ప్రధానికి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. తాను యోగా చేస్తానని, దానికి సంబంధించిన వీడియోను త్వరలోనే సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని చెప్పారు. యోగాసనాలు తనకెంతో ఉపయోగపడ్డాయని, ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఇలాం టి యోగా చిట్కాలు ప్రజలకు కూడా ఉపయోగపడుతాయన్న ఉద్దేశంతో వాళ్లకు చెబుతున్నానని మోదీ పేర్కొన్నారు. ఈ వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వీక్షించి ప్రశంసలు కురిపించారు. ‘ఇది అద్భుతంగా ఉంది. మీకు ధన్యవాదాలు’ అని ఆమె ట్వీట్‌ చేశారు.


logo