ఆదివారం 12 జూలై 2020
National - Jun 21, 2020 , 08:51:37

యోగా డే స్పెష‌ల్‌: ప‌్ర‌ముఖుల యోగాసనాలు

యోగా డే స్పెష‌ల్‌: ప‌్ర‌ముఖుల యోగాసనాలు

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ యోగా డేను పుర‌స్క‌రించుకుని దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖులు యోగా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో యోగాస‌నాలు వేశారు. కేంద్ర‌మంత్రులు ప్ర‌హ్లాద్ ప‌టేల్‌, గిరిరాజ్ సింగ్‌, ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ సైతం యోగా చేశారు. ప్రకాష్‌ జ‌వ‌దేక‌ర్ త‌‌న సతీమ‌ణితో క‌లిసి యోగాస‌నాలు వేశారు. ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారితో క‌లిసి యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి యోగా చేశారు. 

వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం అంత‌ర్జాతీయ యోగా డే సంద‌ర్భంగా యోగా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేష్ భ‌గేల్‌, ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ వారివారి నివాసాల్లో యోగాస‌నాలు వేసి యోగా డే జ‌రుపుకున్నారు. భోపాల్ బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ నాయ‌కురాలు ప్ర‌గ్యా సింగ్ ఠాకూర్‌, ఇత‌ర నేత‌లు యోగా డే నిర్వ‌హించారు.   


logo