న్యూఢిల్లీ, జూన్ 19: ఇన్ఫ్లమేటరీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కో-మార్బిడ్ డిప్రెషన్‌కు అనుబంధ చికిత్సగా యోగా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధులతో బాధపడుతున్న 66 మందిపై ఢిల్లీ ఎయిమ్స్‌లో 2017 నుంచి 2020 మధ్య వైద్యులు అధ్యయనం నిర్వహించారు. యోగా చేయడం వల్ల రోగుల్లో వ్యాధి తీవ్రత తగ్గించినట్టు గుర్తించారు. ‘ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోసైన్స్’లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయని డాక్టర్ రిమా దాదా తెలిపారు.