శుక్రవారం 10 జూలై 2020
National - Jun 02, 2020 , 11:43:25

పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు యోగా క్యాంపులు

పోలీసులు,  వారి కుటుంబ సభ్యులకు యోగా క్యాంపులు

లక్నో : కోవిడ్‌-19 వల్ల విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు తీరికలేని విధుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువ పనిగంటలు, కుటుంబానికి దూరంగా ఉండటం వంటి చర్యలు వారిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక యోగా క్యాంపులను నిర్వహిస్తోంది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల మధ్య యోగా తరగతులను నిర్వహిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా పోలీసులు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహాకులు తెలిపారు. కరోనా యోధుల్లో రోగనిరోధకశక్తి పెరిగేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీస్‌లైన్‌ ఇన్ఛార్జ్‌ ఇంద్రవీర్‌ సింగ్‌ పేర్కొన్నారు.


logo