మంగళవారం 31 మార్చి 2020
National - Mar 06, 2020 , 08:59:49

రూ.50వేలకు మించి తీసుకోవద్దు..

రూ.50వేలకు మించి తీసుకోవద్దు..

హైద‌రాబాద్‌:  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ఆర్బీఐ విశ్వప్రయత్నాలనే చేస్తున్నది. సంస్థ పునరుద్ధరణలో భాగంగా గురువారం మారటోరియం విధించిన సెంట్రల్‌ బ్యాంక్‌.. నగదు ఉపసంహరణలపైనా పరిమితులు పెట్టింది. ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి తీసుకోరాదని నిర్ణయించింది. అంతకుమించి కావాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ఇక తక్షణమే బోర్డును రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్‌ కుమార్‌ను బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. డిపాజిటర్ల ప్రయోజనాల రక్షణార్థం ప్రభుత్వంతో చర్చించి ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకున్నది. ఈ క్రమంలోనే ఎస్బీఐతోపాటు ప్రైవేట్‌ రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లతో కూడిన కూటమి యెస్‌ బ్యాంక్‌కు చేయూతనివ్వనున్నట్లు గురువారం సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.  మారిటోరియం నేప‌థ్యంలో యెస్ బ్యాంకుల ఏటీఎంల‌లో అవుట్ ఆఫ్ క్యాష్ బోర్డులు క‌నిపిస్తున్నాయి.  ముంబైలోని పార్లేలో ఉన్న ఏటీఎంల వ‌ద్ద ఈ బోర్డులు క‌నిపించాయి. 50వేల‌కు మించి తీసుకోవ‌ద్దు అని ఆర్బీఐ నిషేధం విధించిన నేప‌థ్యంలో.. క‌స్ట‌మ‌ర్లు ఏటీఎంల‌కు భారీ సంఖ్య‌లో చేరుకుంటున్నారు. 
logo
>>>>>>