గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 12:39:50

యెస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఊరట..ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌ సేవలు పాక్షికంగా పునరుద్ధరణ..

యెస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఊరట..ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌ సేవలు పాక్షికంగా పునరుద్ధరణ..

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యెస్‌ బ్యాంకుపై విధించిన మారటోరియం నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆ బ్యాంకు కస్టమర్లకు కొంత ఉపశమనం కలిగింది. మంగళవారం నుంచి యెస్‌ బ్యాంకు కస్టమర్లకు నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌ సేవలను అందిస్తున్నట్లు ఆ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే యెస్‌ బ్యాంక్‌ నుంచి ఇతర బ్యాంకులకు ఆ సేవలు పనిచేయవని, కేవలం ఇన్‌వార్డ్‌ ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని యెస్‌ బ్యాంక్‌ తెలిపింది. యెస్‌ బ్యాంకులో క్రెడిట్‌ కార్డులు, లోన్లు కలిగి ఉన్నవారు ఆయా చెల్లింపులు చేసేందుకు గాను ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌ సేవలను పునరుద్ధరించామని ఆ బ్యాంక్‌ తెలిపింది. ఈ క్రమంలో ఇతర బ్యాంకుల నుంచి యెస్‌ బ్యాంకు అకౌంట్లకు డబ్బులు పంపుకునేందుకు వీలు కలుగుతుంది.. కానీ యెస్‌ బ్యాంకు నుంచి ఇతర బ్యాంకు అకౌంట్లకు డబ్బులు పంపేందుకు వీలు ఉండ‌ద‌ని ఆ బ్యాంక్‌ ప్రతినిధులు తెలిపారు. 


logo
>>>>>>