సోమవారం 30 మార్చి 2020
National - Mar 08, 2020 , 10:57:35

యెస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్‌ అరెస్ట్‌

యెస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్‌ అరెస్ట్‌

ముంబయి : యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానాకపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టేరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం బ్యాంక్‌ స్కాం, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ అతడిని అరెస్ట్‌ చేసింది. శుక్రవారం రాత్రి ఈడీ అధికారులు రానాకపూర్‌ నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టి విచారించారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారడం అదేవిధంగా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చినా రుణాల్లో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలు లభించడంతో ఈడీ కపూర్‌ను అరెస్ట్‌ చేసింది.


logo