శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 10:35:05

రెండు నెల‌ల వేత‌నం విరాళంగా ప్ర‌క‌టించిన‌ వైసీపీ ఎంపీలు

రెండు నెల‌ల వేత‌నం విరాళంగా ప్ర‌క‌టించిన‌ వైసీపీ ఎంపీలు

అమ‌రావ‌తి: ప‌్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డంలో త‌మ‌ వంతు సాయంగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త‌మ రెండు నెల‌ల వేత‌నాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు. ఆ రెండు నెల‌ల వేత‌నంలో ఒక నెల వేత‌నాన్ని ప్ర‌ధాని సహాయ నిధికి, మరో నెల వేత‌నాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి  విరాళంగా ఇవ్వనున్నట్టు వైసీపీ ఎంపిలు వెల్ల‌డించారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయ‌కుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. 

ప్రాణాంత‌క క‌రోనా వైరస్ ప్ర‌పంచ దేశాల‌ను స్తంభింపజేసింద‌ని, దీంతో దాదాపు అన్ని దేశాల్లో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో వైసీపీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలోనూ ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డానికి క‌ట్ట‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో త‌మ వంతు సాయంగా రెండు నెల‌ల వేత‌నాన్ని విరాళంగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించామ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. 


logo