గురువారం 09 జూలై 2020
National - Apr 19, 2020 , 15:25:11

'క్రెడిబులిటీ కోల్పోయాక చెల్లని రూపాయితో సమానం'

'క్రెడిబులిటీ కోల్పోయాక చెల్లని రూపాయితో సమానం'

అమరావతి: వైజాగ్‌లో కరోనా కేసులు దాచిపెడుతున్నారని చంద్రబాబు, పచ్చ మీడియా దుర్మార్గపు ఆరోపణలు చేశారని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.  ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యల వల్లే అక్కడ వ్యాధి పెద్దగా ప్రబల లేదని వెల్లడించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బాగా గడ్డి పెట్టాడని ఎద్దేవా చేశారు. బాబూ! మీ ఏడుపులు ఆగవు, బుద్దులు మారవు. అని విజయ సాయిరెడ్డి విమర్శించారు. ఇవాళ పలు అంశాలపై ఆయన ట్విటర్లో స్పందించారు. 

'మీడియాలో కనిపించకపోతే బతకలేడు చంద్రబాబు. ఠంచనుగా రోజుకోసారి వీసీల పేరుతో వాయిస్తున్నాడు. ఆయన ఏం చెబూతున్నాడో కాని క్షేత్ర స్థాయిలో పచ్చపార్టీ పెద్ద నాయకులెవరూ సేవా కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ప్రచార పిచ్చి ముదిరి ఆయనిలాగే సోది వేస్తాడులే అని ఉదాసీనంగా ఉన్నట్టున్నారు.' అని ట్వీట్‌ చేశారు.

'అనుకూల మీడియాను ప్రజలు ఛీ కొడుతున్నారని బాబుకు కూడా తెలిసిపోయినట్టుంది. సోషల్ మీడియా స్క్రిప్ట్ రైటర్లను పెట్టుకుంటా అని చెబ్తున్నాడు. జాకీలు, క్రేన్లే విరిగి మూలకు పడితే కిరాయి రాతలేం చేస్తాయి? జీవితమంతా మ్యానిపులేషన్లే కదా. క్రెడిబులిటీ కోల్పోయాక చెల్లని రూపాయితో సమానం.' అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 


logo