శుక్రవారం 03 జూలై 2020
National - Apr 20, 2020 , 14:51:15

'మరణాలు పెరిగితే శవ రాజకీయాలు చేయొచ్చని ఆరాటం'

'మరణాలు పెరిగితే శవ రాజకీయాలు చేయొచ్చని ఆరాటం'

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై  వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ధ్వజమెత్తారు.  కచ్చితంగా కన్నా టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబుకు అమ్ముడు పోయారని మరోసారి ఆరోపించారు.  ఇవాళ ట్విటర్‌ వేదికగా విజయ సాయిరెడ్డి  మరోసారి స్పందించారు. 

'దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ  ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నాలాంటి వారే కారణం. బాబు ప్యాకేజి ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బీజేపీలో  ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి.'అని విజయ సాయిరెడ్డి సూచించారు. 

'నిన్నటి వరకు టెస్టులు చేయడం లేదు. కోవిడ్ కేసుల సంఖ్యను  దాచిపెడుతున్నారని ఏడ్చిన వ్యక్తి, ఇప్పుడు ఎవరినడిగి దక్షిణ కొరియా నుంచి టెస్ట్ కిట్లు కొన్నారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రభుత్వం ఏ పని చేయకూడదు. మరణాలు పెరిగితే శవ రాజకీయాలు చేయొచ్చని ఆరాటం.' అని విమర్శించారు. 


logo