గురువారం 04 జూన్ 2020
National - May 17, 2020 , 17:42:26

బాబు వాడకం ఎలా ఉంటుందంటే..!

బాబు వాడకం ఎలా ఉంటుందంటే..!

అమరావతి: డాక్టర్ సుధాకర్ ఘటనపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూనే సుధాకర్ వ్యవహరించిన తీరుపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు.  'బాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది. ఎల్లో వైరస్ ప్రభావంతో వైజాగ్ లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని! అయ్యో అంత అన్యాయం జరిగిందా అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుంది.' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

'పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే తన పార్టీకి పుట్టగతులుండవనే భయం పట్టుకుంది బాబుకు. జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నాడట. రాజధానిలో పేదలకు పట్టాలివ్వకుండా కోర్టు స్టే ఇవ్వడం ఉత్సాహం నింపిందని అంటున్నారు.' అంటూ మరో ట్వీట్‌లో విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.logo