శుక్రవారం 03 జూలై 2020
National - Apr 05, 2020 , 19:07:59

మీకు అర్థమవుతోందా బాబూ?

మీకు అర్థమవుతోందా బాబూ?

అమరావతి:  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర రాలేదని,  ప్రజలను దళారులు దోచుకున్నారని విజయ సాయిరెడ్డి  ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి   ప్రభుత్వం  కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని  కొనుగోలు చేస్తుందన్నారు.  

'చంద్రబాబు ఐదేళ్ల పాలనలో  రైతులకు ఏనాడు గిట్టుబాటు ధర రాలేదు. దళారులదే రాజ్యంగా ఉండేది. ఇప్పుడు ధాన్యం క్వింటా 1835కు ప్రభుత్వమే కొంటోంది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నూకల పేరుతో కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేసిన మాఫియా ఆటలు సాగవు. అర్థమవుతోందా బాబూ?' అని విజయ సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 


logo