శుక్రవారం 03 జూలై 2020
National - Apr 05, 2020 , 16:54:19

ప్రాణం పోవాలని ఎవరూ అనుకోరు..!

ప్రాణం పోవాలని ఎవరూ అనుకోరు..!

అమరావతి:  'చైనా నుంచి కరోనా మహమ్మారి  ప్రపంచమంతా వ్యాపించింది. కరోనా వైరస్‌కు కులాలు,  మతాలు లేవు. ఎవరికైనా సోకవచ్చు. తమ ప్రాణం పోవాలని ఎవరూ అనుకోరు. కొద్దిమందిని అనుమానించి దోషులుగా చూడొద్దు. అందరం సంఘటితంగా నిలబడి  ఎదుర్కోవాల్సిన సమయమిది. ఈ మహమ్మారిని తరిమేసే వరకు  పోరాడాల్సిందేనని' వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. 

'సామాజిక దూరం పాటించాలి. ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉంటే తప్ప కరోనాను నియంత్రించలేం. మహారాష్ట్రలో కరోనా మూడో స్టేజికి వెళ్లినట్టు అక్కడ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరినీ కలవకున్నా వ్యాధి సోకినట్టు గుర్తించారు. మనకు ఆలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలి.' అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 


logo