సోమవారం 25 మే 2020
National - Apr 01, 2020 , 18:17:17

కరువు జాడ నీతోనే పోయింది..!

కరువు జాడ నీతోనే పోయింది..!

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా  ఉండి కట్టించిన కోల్డ్‌ స్టోరేజీలు ఎన్ని అని చంద్రబాబును విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు. 

ధరల స్థిరీకరణ నిధి నీ హయాంలో లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తివి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా బాబూ? ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం  జగన్ హామీ ఇచ్చారు. పంట కోతలు యథావిధిగా జరగాలని ఆదేశించారు. రైతు నష్టపోకుండా చూసే పూచీ ప్రభుత్వానిది.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కట్టించిన కోల్డ్ స్టోరేజి కేంద్రాలెన్నీ చంద్రబాబూ? రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నావు?  రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎవరూ ఆకలితో బాధపడే పరిస్థితి లేదు. కరువు జాడ నీతోనే పోయింది. ఇంకెప్పుడూ రావద్దని ప్రజలు కోరుకుంటున్నారు.

హుదూద్, తిత్లీ తుఫాన్లను డీల్ చేశా అని కటింగులిస్తున్నాడు.  తుఫాను పోయిన నాలుగు రోజుల తర్వాత కూడా మంచినీళ్లు అందించలేని పాలన నీది. వందల ట్యాంకర్లు సరఫరా చేసినట్టు బిల్లులు మింగారు. శ్రీకాకుళంలో బస్సు వద్దకు బాధితులు వచ్చి నిలదీస్తే, ఏయ్ మీదే వూరని గద్దించింది నువు కాదా? అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 



logo