శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 16:25:39

పిల్లల నోరుకొట్టి..హిమాలయ వాటర్‌కు మాత్రం కోట్లు పోశావు!

పిల్లల నోరుకొట్టి..హిమాలయ వాటర్‌కు మాత్రం కోట్లు పోశావు!

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుపై వైసీపీ  ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు  ప్రజా ధనాన్ని దోచుకున్నాడని     విజయ సాయిరెడ్డి ఆరోపించారు. 

ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు  చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు? 

జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి విద్యార్థులకు 20 వేల వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియంలో బోధన. విద్యార్థుల భవిష్యత్తు కోసం రూపొందించిన ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కనిపించవు. పిల్లల నోరుకొట్టి మీరు తాగే హిమాలయ వాటర్ కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ! 

ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సీఎం   జగన్  నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర  ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా? అని విజయ సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


logo