బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 11:49:33

చంద్రబాబు భయపడిందిక్కడే..

చంద్రబాబు భయపడిందిక్కడే..

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌   రాసినట్టు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి హెచ్చరించారు. నిమ్మగడ్డ లేఖ వివాదంపై  విజయ సాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు.

నిమ్మగడ్డ రాసినట్టు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు. అందులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయి. చంద్రబాబు అయినా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు.

స్థానిక ఎన్నికల్లో టీడీపీ  అభ్యర్థులు ఆశచూపిన డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారు. చంద్రబాబు భయపడిందిక్కడే. డబ్బు, మందు లేకుండా ఎలక్షన్లు జరిగితే జిల్లాల వారిగా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతామన్న ఆందోళనతో డ్రామాలు మొదలు పెట్టాడు. నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించాడు. అని విజయ సాయిరెడ్డి ఆరోపించారు. logo