శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 01:25:17

తండ్రి జయంతి రోజున నానమ్మ కోరిక నెరవేర్చాడు

తండ్రి జయంతి రోజున నానమ్మ కోరిక నెరవేర్చాడు

న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటంపై ఆయన మేనత్త, బీజేపీ నేత యశోధర రాజె స్పందించా రు. ‘కుటుంబ సభ్యులందరూ ఒకేదగ్గర ఉండాలన్నది విజయరాజె సింధియా(రాజమాత) ఆఖరి కోరిక. తండ్రి మాధవ్‌రావు సింధియా జయంతి రోజే (మార్చి 10) జ్యోతిరాదిత్య తన నానమ్మ కోరికను నెరవేర్చాడు. జాతి ప్రయోజనాల కోసం రాజమాత రక్తం ఓ నిర్ణయాన్ని తీసుకున్నది. ఇప్పుడు దూరాలన్నీ చెదిరిపోయాయి’ అని యశోధర రాజె తెలిపారు. కాంగ్రెస్‌ కోసం జ్యోతిరాదిత్య అంకితభావంతో పనిచేసేవాడని, అయితే ఆయన ఆత్మ గౌరవాన్ని గాయపరిచే విధంగా ఏదో జరిగి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. 


logo