శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 17:27:16

యమహా మోటార్ ఇండియా సరికొత్త ప్రోగ్రామ్...

 యమహా మోటార్ ఇండియా సరికొత్త ప్రోగ్రామ్...

ముంబై :యమహా మోటార్ ఇండియా తన ఎమ్‌టి-15 కొనుగోలుదారుల కోసం దేశంలో కస్టమైజ్ ప్రోగ్రాం ను ప్రారంభించింది. "కస్టమైజ్ యువర్ వారియర్ (సి వై డబ్ల్యూ)"  పేరుతో ఈ సంస్థ ఎమ్‌టి-15 మోడల్ బైక్ ను కొనుగోలు చేసేటప్పుడు మొత్తం 11 డిఫరెంట్ కలర్స్  బైక్ లను ఎంచుకునే అవకాశం ఉన్నది. యమహా కొత్త కలర్ కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌ను భారతీయ మార్కెట్లో 150 సిసి విభాగంలో ఖచ్చితంగా అందించే స్పెషల్ ఆఫర్. కొత్త కస్టమైజ్ యువర్ వారియర్ (సివైడబ్ల్యు) ప్రోగ్రామ్‌తో, ఎమ్‌టి-15 మోడల్‌కు ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎమ్‌టి-15 కోసం కొత్త కలర్ కస్టమైజేషన్ ప్రోగ్రాం కింద, సివైడబ్ల్యు అనే మోటారుసైకిల్   కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. కొత్త ఎమ్‌టి-15 సివైడబ్ల్యు వారెంట్ ధర రూ. 1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఎమ్‌టి-15 ను మూడు బాడీ పెయింట్ , చక్రాల కోసం నాలుగు కలర్ స్కీమ్‌లలో అందిస్తున్నారు. ఇది వినియోగదారులకు వారి ఎమ్‌టి-15 సివైడబ్ల్యు మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఎంచుకోవడానికి 14 వివిధ కలయికలను ఇస్తుంది. వినియోగదారుల నుండి అందుకున్నఆర్డర్ ఆధారంగా ఈ వాహనాలను యమహా తయారు చేస్తుంది. డెలివరీ జనవరి 2021 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ప్రకారం, ఎల్లో కలర్ వీల్ మోడల్ మార్చి 2021 నుండి డెలివరీని ప్రారంభిస్తుంది.

కొత్త ఎమ్‌టి-15 (సివైడబ్ల్యు) కలర్ కస్టమైజేషన్ ప్రోగ్రామ్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందని, ఇది యువ వినియోగదారులను ఎమ్‌టి ప్రపంచంలోకి ఆకర్షిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది వారి అవసరానికి అనుగుణంగా రంగు కలయికతో అనేక ఎంపికలను అందిస్తుంది. కొత్త కలర్ కాంబినేషన్ కాకుండా, మోటారుసైకిల్‌లో ఇతర మార్పులు చేయలేదు. కొత్త ఎమ్‌టి-15 సివైడబ్ల్యూకి స్టాండర్డ్ వేరియంట్‌పై రూ. 4,000 ప్రీమియం ధర లభించింది. ఇప్పుడు దీని ధర రూ. 1.39 లక్షలు 

ఎమ్‌టి-15 లిక్విడ్ కూల్డ్ ఎస్ఓహెచ్సి 155 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది బ్రాండ్  వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది 10000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 18 బిహెచ్‌పి , 8500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసారు. యమహా ఎమ్‌టి-15 హైలైట్ చేసిన కొన్ని ఫీచర్స్ గమనించినట్లైతే దీని ముందుభాగంలో సింగిల్-ఛానల్ ఎబిఎన్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్‌లు, పుల్లీ డిజిటల్ ఎల్సీడీ  ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. ఎమ్‌టి-15 రూపకల్పన బ్రాండ్ ఎమ్‌టి-09 సూపర్ బైక్ నుండి ప్రేరణ పొందింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.