ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 21:49:43

తప్పు వార్తలు రాస్తే.. జైలు శిక్ష,

తప్పు వార్తలు రాస్తే..  జైలు శిక్ష,

అమరావతి: కరోనా కేసులుకు సంబంధించి ఇష్టానుసారంగా వార్తలు ఇస్తే.. శిక్షలు తప్పవని ఆధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రసార సాధనం కూడా అధికారిక ఉత్తర్వులు లేనిదే వార్తలు ప్రసారం చేయకూడదని తెలిపారు. కోవిడ్-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారిగా ప్రకటించింది.   ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అధికారాలను ఉపయోగించుకుని, సామాజిక దూరాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.  కరోనా మహమ్మారిపై  అసత్యాలను ప్రసారం చేసి భయాందోళనలు సృష్టించవద్దు.

తప్పు వార్తలు రాస్తే.. ఆ వ్యక్తికి ఒక యేడాది జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం - 1995 ప్రకారం చర్యలు ఉంటాయి సుప్రీంకోర్టు "మీడియాను ఒక  నిర్మాణాత్మకమై బాధ్యతను నిర్వహించాలని సూచించింది. భయాందోళనలకు గురిచేసే ధృవీకరించని వార్తలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని ఆదేశించిందని తెలిపారు. 


logo