మంగళవారం 31 మార్చి 2020
National - Mar 16, 2020 , 12:26:54

విద్యార్థుల రుణాల‌ను మాఫీ చేస్తారా..

విద్యార్థుల రుణాల‌ను మాఫీ చేస్తారా..

హైద‌రాబాద్‌:  దివాళా తీసిన బ్యాంకుల‌ను మోదీ ప్ర‌భుత్వం ఆదుకుంటోంది.  వేల కోట్ల అప్పుల్లో ఉన్న బ్యాంకుల రుణాల‌ను ఆ ప్ర‌భుత్వం క్లియ‌ర్ చేస్తోంది.  తాజాగా ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్ర‌కారం ఈ విష‌యం వెల్ల‌డైంది.  దీనిపై ఓ జ‌ర్న‌లిస్టు త‌న క‌థ‌నంలో అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు.  2014 నుంచి సుమారు ఆరు ల‌క్ష‌ల 60 వేల కోట్ల బ్యాడ్ లోన్స్‌ను ప్ర‌భుత్వం క్లియ‌ర్ చేసిన‌ట్లు ఓ జ‌ర్న‌లిస్టు త‌న రిపోర్ట్‌ను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను ప్ర‌స్తావిస్తూ.. ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు.  కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న త‌న ట్వీట్‌లో విమ‌ర్శించారు.  రుణాలు తీసుకున్న విద్యార్థులు త‌మ బాకీలు చెల్లించేందుకు ఇబ్బంది ప‌డుతున్నారని, అలాంటి వాళ్ల రుణాల‌ను మీరు మాఫీ చేస్తారా అని ఎంపీ అస‌ద్ ప్ర‌శ్నించారు. గృహ రుణాలు తీసుకున్న వారి సంగ‌తేంటి అని కూడా ఆయ‌న అడిగారు.  రుణాలు పెరిగిపోవ‌డం వ‌ల్ల రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న‌ట్లు ఓవైసీ ఆరోపించారు. 


logo
>>>>>>