ఆదివారం 12 జూలై 2020
National - Jun 23, 2020 , 13:54:30

జ‌వాన్ సునీల్‌కు ఘ‌న నివాళులు

జ‌వాన్ సునీల్‌కు ఘ‌న నివాళులు

శ్రీన‌గ‌ర్‌‌: ఉగ్ర‌వాదుల‌తో ఎన్‌కౌంట‌ర్‌లో వీర‌మ‌ర‌ణం పొందిన సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కాలే సునీల్‌కు తోటి జ‌వాన్లు ఘ‌నంగా నివాళులు అర్పించారు. సీఆర్‌పీఎఫ్ ఉన్న‌తాధికారులు, జ‌వాన్లు ఆయ‌న భౌతికకాయంపై పుష్ప‌గుచ్ఛాలుంచి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఈ తెల్ల‌వారుజామున జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలోని బాండ్‌జూ ఏరియాలో ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ 182వ బెటాలియ‌న్‌కు చెందిన కాలె సునీల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో తోటి సైనికులు ఆయ‌న‌ను చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, చికిత్స పొందుతూ కాసేప‌టికే ఆయ‌న మ‌ర‌ణించారు. కాగా, ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట్‌ర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చాయి.  logo