శనివారం 04 జూలై 2020
National - Jun 18, 2020 , 18:07:15

అమర‌ జ‌వాన్ గ‌ణేశ్‌ రామ్‌కు ఘ‌న నివాళ్లు

అమర‌ జ‌వాన్ గ‌ణేశ్‌ రామ్‌కు ఘ‌న నివాళ్లు

రాయ్‌పూర్‌: ల‌ఢ‌ఖ్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మృతిచెందిన జ‌వాన్ గ‌ణేశ్ రామ్ పార్థివదేహానికి ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేశ్ భ‌గేల్, మాజీ ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్‌సింగ్‌తోపాటు ప‌లువురు ఆర్మీ ఉన్న‌తాధికారులు, జ‌వాన్లు, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. గ‌ణేశ్ రామ్ పార్థివదేహంపై పుష్ప గుఛ్చాలుంచి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. జూన్ 15, 16 తేదీల్లో గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌, చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో గ‌ణేశ్ రామ్ స‌హా 20 మంది భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా అధికారికంగా వెల్ల‌డించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆ దేశానికి చెందిన సైనికులు కూడా 35 మంది మ‌ర‌ణించార‌ని అమెరికా ఇంటె‌లిజెన్స్ వ‌ర్గాలు తెలిపాయి. 

ఒక స్కూల్‌కు అమర జవాన్‌ గణేశ్‌రాంకుంజమ్‌ పేరు పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ఆయన కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం భూపేశ్‌ బగేల్‌ పేర్కొన్నారు.                        


logo