శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 28, 2020 , 09:47:29

నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

హైద‌రాబాద్ : నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం. మ‌న జీవితంలో ప్ర‌కృతి ప్రాముఖ్య‌త‌ను, దాన్ని ఎందుకు ప‌రిర‌క్షించాలో గుర్తుచేసే మ‌రో ముఖ్య‌మైన రోజు నేడు. ప్రకృతి పరిరక్షణ గురించి అవగాహన పెంచడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి ఈ రోజు మనకు అవకాశాన్ని ఇస్తుంది. సహజ వనరులను పరిరక్షించేందుకు ఉత్తమమైన పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. భూమిపై ప‌రిమిత వ‌న‌రులు ఉన్నందున సమతుల్యతను కాపాడుకోవడానికి వాటిని సమర్థవంతంగా ఉపయోగించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తుంది. జ‌నాభా విస్పోట‌నం సహజ వనరులు చాలా వేగంగా క్షీణించటానికి ఓ ప్రధాన కారణం ఉంది. సాంకేతిక పురోగతి, విలాసవంతమైన జీవనశైలి, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత, ఇటీవ‌లి కాలంలో అమెజాన్ అడ‌వుల్లో చెల‌రేగిన మంట‌లు వంటివి పర్యావరణ సమస్యలను లేవనెత్తుతున్నాయి. భ‌విష్య‌త్తులో బాధ‌ప‌డ‌కుండా ఉండాలంటే ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త కోసం వీటిని పాటించాలి. 

-  ఆహర‌, నీటి వృథాను అరికట్ట‌డం

- రోజువారి కార్య‌క‌లాపాల్లో కాలుష్యాన్ని పెంపొందించే వాటిని నిరుత్సాహ‌పర‌చ‌డం 

- ప‌నిలో లేన‌ప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిష‌న‌ర్‌ల‌ను బంద్ చేయ‌డం  

- దంతాల‌ను, చేతుల‌ను శుభ్ర‌ప‌రుచుకునేప్పుడు న‌ళ్లాల‌ను అన‌వ‌స‌రంగా తిప్పి ఉంచ‌కుండా ఉండి నీటి వృథాను అరిక‌ట్ట‌డం. 

మన దైనందిన జీవితంలో ఇటువంటి చిన్న‌ చిన్న ప‌నుల‌ను ఆచ‌రించ‌డం వ‌ల్ల ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో స‌హాయం ప‌డిన‌వాళ్ల‌మౌతాం. స‌మీప భ‌విష్య‌తుల్లో ఎదుర‌య్యే ఎటువంటి ప్ర‌కృతి విపత్తుల నుంచైనా మాన‌వాళిని ర‌క్షించుకోవ‌చ్చు. అందుకు కుటుంబ సభ్యుల్లో సైతం అవగాహన కల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రకృతిని రక్షించడానికి, పరిరక్షించడానికి స్థిరమైన జీవనశైలిని ఆచరించడం.


logo