ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 10:05:42

మొరాదాబాద్ ఇటుక బ‌ట్టీల్లో ప‌నులు ప్రారంభం

మొరాదాబాద్ ఇటుక బ‌ట్టీల్లో ప‌నులు ప్రారంభం

ల‌క్నో: ఒక‌వైపు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌గానే మ‌రోవైపు కొన్ని ప్రాంతాల్లో ప‌నులు ప్రారంభ‌మ‌వుతున్నాయి. లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్మాణ‌రంగానికి సంబంధించిన ప‌నులు, వ్యాపారాల‌కు అనుమ‌తి ఇచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాయి. అయితే క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న చాలా ప్రాంతాల్లో మాత్రం సంబంధిత ప‌నులు, వ్యాపారాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన పాల‌నా యంత్రాంగం ఇటుక బ‌ట్టీల్లో ప‌నులకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో పాక్ బాడా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని 100 ఇటుక బ‌ట్టీల్లో ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo