గురువారం 04 జూన్ 2020
National - May 11, 2020 , 19:14:42

ప‌నులు ప్రారంభం.. 25,000 కంపెనీలు, 6 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు

ప‌నులు ప్రారంభం.. 25,000 కంపెనీలు, 6 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు

ముంబై: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్లో స‌డ‌లింపులు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు మ‌హారాష్ట్ర‌లో కొన్ని ప‌రిశ్ర‌మ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నాన్‌-రెడ్ జోన్ ఏరియాల్లోని 25,000 కంపెనీలు 6,00,000 మంది ఉద్యోగులతో ప‌నులు మొద‌లుపెట్టాయ‌ని మ‌హారాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ చెప్పారు. రాష్ట్రంలోని నాన్‌-రెడ్ జోన్ ఏరియాల్లో మొత్తం 57,745 లైసెన్స్‌డ్ కంపెనీలు ఉండ‌గా, అందులో 25 వేల కంపెనీలు ఇప్ప‌టికే ఉత్ప‌త్తిని ప్రారంభించాయ‌ని ఆయ‌న చెప్పారు. ముంబై, పుణె, థానేల్లో కూడా ప‌రిశ్ర‌మ‌ల‌ను పునఃప్రారంభించాలంటూ డిమాండ్లు వ‌స్తున్నాయ‌న్న మంత్రి దేశాయ్.. ఆ ప్రాంతాలు రెడ్ జోన్లుగా ఉండ‌టంవ‌ల్ల ఇప్ప‌ట్లో ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రారంభించే అవ‌కాశం లేద‌న్నారు. ‌

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo