గురువారం 09 జూలై 2020
National - Apr 20, 2020 , 13:59:43

కాంట్రాక్ట‌ర్ ర‌మ్మ‌న్నాడు.. కంపెనీ పొమ్మంటున్న‌ది!

కాంట్రాక్ట‌ర్ ర‌మ్మ‌న్నాడు.. కంపెనీ పొమ్మంటున్న‌ది!

కోల్‌క‌తా: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లు లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల్లో లాగే ప‌శ్చిమ‌బెంగాల్‌లో కూడా ప్ర‌జ‌లు ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. స్కూళ్లు, హోట‌ళ్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు, కాలేజీలు, కంపెనీలు అన్నీ మూత‌ప‌డ్డాయి. దీంతో రెక్క‌డితేగానీ డొక్కాడ‌ని కూలీలు ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. చేయ‌డానికి ప‌నిలేక‌, ప్ర‌భుత్వాలు చేసే అర‌కొర సాయం చాల‌క తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. 

ఇంత‌లో ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని స‌డ‌లింపులు చేయ‌నున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించడం, అందులో జ్యూట్ మిల్లుల‌కు మిన‌హాయింపును ఇస్తున్న‌ట్లు పేర్కొనడం ఆయా మిల్లుల్లో ప‌నిచేసే కూలీల్లో ఆశ‌లు చిగురింప‌జేసింది. ఈ మేర‌కు లేబ‌ర్ కాంట్రాక్ట‌ర్లు కూడా కంపెనీల ద‌గ్గ‌రికి ర‌మ్మ‌ని ఫోన్లు చేయ‌డంతో కూలీలు సంతోషంగా వెళ్లారు. కానీ అక్క‌డ వారికి నిరాశే మిగిలింది. కంపెనీల గేట్ల‌కు తాళాలు తీయ‌లేదు, ర‌మ్మ‌ని పిలిచిన కాంట్రాక్ట‌ర్ కాన‌రాలేదు. దీంతో చేసేదేమీ లేక కూలీలు కంపెనీల గేట్ల ద‌గ్గ‌రే ప‌డిగాపులు కాయాల్సి వ‌చ్చింది.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo