బుధవారం 08 జూలై 2020
National - Jun 22, 2020 , 16:35:05

పెట్రోల్‌ ధరల పెరుగుదలపై నిరసన

పెట్రోల్‌ ధరల పెరుగుదలపై నిరసన

న్యూఢిల్లీ: గత 15 రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశీయ చమురు రంగ సంస్థలు పెంచుతున్నాయి. గతంలో నెల వారీగా డైనమిక్‌ పద్ధతిలో సమీక్షించే చమురు రంగ సంస్థలు ఈ నెల మొదలు రోజు వారీగా ధరలను సమీక్షించి ఆ మేరకు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా 15 రోజులకుపైగా పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలను పెంచడంపై కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) సోమవారం ఢిల్లీలో నిరసన తెలిపింది. కారుకు తాడు కట్టి లాగుతూ విద్యార్థులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇదేమీ దోపిడీ అంటూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులను ప్రదర్శించడంతోపాటు నినాదాలు చేశారు. logo