గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 09:03:54

పీపీఈ కిట్‌ ధరించి హెయిర్‌కట్‌

పీపీఈ కిట్‌ ధరించి హెయిర్‌కట్‌

ఖేడా : కరోనా భారి నుంచి తప్పించుకునేందుకు స్వీయ వ్యక్తిగత జాగ్రత్తలే రక్ష. కోవిడ్‌-19 ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గంగా ఉంది. కాగా హెయిర్‌ సెలూన్లలో భౌతిక దూరం పాటించడం కష్టమేనన్న సంగతి తెలిసిందే. దీన్ని నివారించేందుకు తమ నుంచి వేరొకరికి, ఇతరుల నుండి తమకు కరోనా సోకకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుజరాత్‌లోని నడియాడ్‌ పట్టణంలోని హెయిర్‌ ైస్టెలిస్టులు. పీపీఈ(పర్సనల్‌ ప్రొటక్టివ్‌ ఎక్యూప్‌మెంట్‌) కిట్లు ధరించి కస్టమర్లకు కటింగ్‌ చేస్తున్నారు. కస్టమర్లు సైతం ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరిగా వినియోగాంచాల్సిందే. సెలూన్‌లో భౌతిక దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వ సూచించిన అన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తూ తాము పనిచేసుకుంటున్నట్లు షాపు యజమాని విశాల్‌ లింబాచియా తెలిపారు.


logo