సోమవారం 01 జూన్ 2020
National - May 21, 2020 , 09:22:44

అసోం టీ ఎస్టేట్స్‌లో పనులు తిరిగి ప్రారంభం

అసోం టీ ఎస్టేట్స్‌లో పనులు తిరిగి ప్రారంభం

దిబ్రూగర్‌ : అసోం టీ ఎస్టేట్స్‌లో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతికదూరాన్ని పాటిస్తూ కూలీలు పనుల్లోకి దిగారు. దేశవ్యాప్త కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ నాల్గొవదశ సడలింపుల్లో భాగంగా టీ ఎస్టేట్స్‌లో పనులు ప్రారంభమయ్యాయి. మనోహరి టీ ఎస్టేట్‌ మేనేజర్‌ రాకేశ్‌ మిశ్రా మాట్లాడుతూ... టీ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పనులు తిరిగి ప్రారంభించినట్లు తెలిపాడు. కార్మికులు శానిటైజేషన్‌, భౌతికదూరం పాటిస్తూ పనులు చేస్తున్నారన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు యాజమాన్యం సైతం తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. కార్మికుడు అమిర్‌ నాయక్‌ మాట్లాడుతూ... తాము అన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తున్నట్లు తెలిపాడు. భౌతికదూరాన్ని పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటున్నట్లు చెప్పాడు. 


logo