గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 01:59:55

హిందువుల సాధికారతకు కృషి చేయాలి

హిందువుల సాధికారతకు కృషి చేయాలి
  • భారత్‌లో పని చేయాలకునే వారికి ఆరెస్సెస్‌ నేత భయ్యాజీ హితవు

పనాజీ: భారత్‌లో పని చేయాలని కోరుకునే వారు హిందూ సామాజిక వర్గం సాధికారత కోసం పని చేయాల్సి ఉంటుందని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి సురేశ్‌ భయ్యాజీ స్పష్టం చేశారు. గోవా రాజధాని పనాజీలోని డోనా పాలాలో ‘విశ్వగురు భారత్‌, ఆరెస్సెస్‌ దృక్కోణం’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో హిందువులు ఎత్తుపల్లాలను చూశారు. భారత్‌ను హిందువు (సామాజిక వర్గం)ల నుంచి విభజించొద్దు. ఈ దేశంలో హిందువులు కేంద్రస్థానంలో ఉన్నారు. హిందువు మతతత్వవాది కాదు. విరోధి కాదు. హిందూ సామాజిక వర్గాలతో కలిసి పనిచేయడానికి ఏ ఒక్కరూ నిరాసక్తత వ్యక్తం చేయనక్కరలేదు. 2020లో భారత్‌ ‘అద్భుతమైన దేశం (సూపర్‌ నేషన్‌)’గా అవతరిస్తుందని ఓ మేధావి చెప్పారు’ అని తెలిపారు. ‘హిందువుల మధ్య ఐక్యత కోసం వారికి అవగాహన కల్పిస్తున్నది ఇతరుల (సామాజిక వర్గాల)కు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి కాదు. ఏ ఒక్కరూ అలా భావించొద్దు. హిందువులు బలపడితే విధ్వంస కార్యకలాపాలు చేయబోరని మేం పూర్తి విశ్వాసంతో చెబుతున్నాం. మేం మానవత్వం, సమాజం కోసం పని చేస్తాం’ అని సురేశ్‌ భయ్యాజీ చెప్పారు. 


logo
>>>>>>