బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 02:46:07

కట్టెపుల్లలతో ఓటు!

కట్టెపుల్లలతో ఓటు!

పట్నా: బీహార్‌లో ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తున్నది. ఓటర్ల కోసం ఖాదీ మాస్కులు, ఈవీఎం యంత్రాల మీట నొక్కడానికి కట్టెపుల్లలు ఏర్పాటు చేయనున్నది. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హెచ్‌ఆర్‌ శ్రీనివాస తెలిపారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌కు కేవలం 1000 మంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 65 ఏండ్లు పైబడ్డ వారికి, కరోనా రోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.


logo