సోమవారం 18 జనవరి 2021
National - Dec 26, 2020 , 18:36:18

NDA కూట‌మికి RLP గుడ్ బై

NDA కూట‌మికి RLP గుడ్ బై

న్యూఢిల్లీ: ‌కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న‌బీజేపీ నేతృత్వంలోని NDA కూట‌మికి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే శివ‌సేన‌, శిరోమ‌ణి అకాలీద‌ళ్ పార్టీలు NDA కూట‌మికి గుడ్ బై చెప్ప‌గా తాజాగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (RLP) ఆ జాబితాలో చేరింది. శ‌నివారం రాజ‌స్థాన్‌లోని అళ్వార్ జిల్లాలో వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడిన RLP అధ్యక్షుడు హ‌నుమాన్ బేనివాల్‌.. రైతులకు వ్య‌తిరేకంగా ప‌నిచేసే ఏ పార్టీకి, కూట‌మికి తాము మ‌ద్ద‌తివ్వ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. 

బీజేపీ నేతృత్వంలోని NDA కూట‌మికి తాము వైదొలుగుతున్నామ‌ని బేనివాల్ స్ప‌ష్టంచేశారు. హ‌నుమాన్ బేనివాల్ 2018లో రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీజేపీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి సొంత పార్టీని స్థాపించారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎంపీగా గెలిచారు. తాజాగా రైతుల ఉద్యమానికి మ‌ద్ద‌తుగా ఎన్డీఏ కూట‌మి నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టన చేశారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.