ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 19:11:31

పుట్టిన రోజును జరుపుకోవడం లేదన్న సీఎం

పుట్టిన రోజును జరుపుకోవడం లేదన్న సీఎం

ముంబై: కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం తన పుట్టిన రోజును జరుపుకోవడం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తన నివాసానికి లేదా కార్యాలయానికి ఎవరూ రావద్దని చెప్పారు. అలాగే ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లు వంటివి ఏర్పాటు చేయవద్దని శివసేన కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. దీనికి బదులుగా సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయాలని, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కోరారు. కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ నెల 27న 60వ ఏట అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన అధికార ప్రతిక సామ్నా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్‌కు ఇటీవల ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను డోనాల్డ్ ట్రంప్‌ను కాదని కరోనాతో  ప్రజలు బాధపడుతుంటే చూడలేనని చెప్పారు. ఉద్ధవ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ నెల 25, 26 తేదీల్లో ప్రచురణ కానున్నది.logo