బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 17:46:25

ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి విమానాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తి లేదు

ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి విమానాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తి లేదు

కోల్ క‌తా : దేశంలోని అన్ని విమాన స‌ర్వీసుల‌కు కోల్ క‌తా ఎయిరో పోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, ముంబై, పుణె, నాగ్ పూర్, చెన్నై, అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్టుల నుంచి కోల్ క‌తా ఎయిర్ పోర్టుకు విమాన సర్వీసుల‌కు అనుమ‌తి లేదు. ఈ అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని కోల్ క‌తా ఎయిర్ పోర్టు ట్వీట్ చేసింది. విమానాల నిలిపివేత జులై 6 నుంచి 19వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని పేర్కొంది. అయితే విమానల రాక‌పోక‌ల నిషేధంపై క‌చ్చిత‌మైన కార‌ణాన్ని కోల్ క‌తా ఎయిర్ పోర్టు వెల్ల‌డించ‌లేదు.  

క‌రోనా వ్యాప్తి దృష్ట్యా దేశీయ విమానాల‌తో పాటు విదేశీ విమానాల‌ను కేంద్రం ర‌ద్దు చేసిన విష‌యం విదిత‌మే. అయితే మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాల రాక‌పోక‌ల‌కు కేంద్రం అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. సైక్లోన్ తుపాను కార‌ణంగా కోల్ క‌తా ఎయిర్ పోర్టును మూసేశారు. గురువారం ఉద‌యం కోల్ క‌తా నుంచి గుహ‌వాటికి 40 మంది ప్ర‌యాణికుల‌తో ఓ విమానం బ‌య‌ల్దేరింది. ఢిల్లీ నుంచి 122 మంది ప్ర‌యాణికులు కోల్ క‌తా ఎయిర్ పోర్టుకు చేరుకున్న‌ట్లు స‌మాచారం.


logo