గురువారం 26 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 02:29:26

మహిళలూ వేటాడేవారు!

మహిళలూ వేటాడేవారు!

న్యూఢిల్లీ: పురాతన కాలంలో జంతువులను వేటాడడం అనేది పురుషులకు సంబంధించిన వ్యవహారంగా మనం సాధారణంగా భావిస్తుంటాం. అయితే అయితే ఈ భావన తప్పని రుజువైంది. పురుషులతోపాటు మహిళలు కూడా అప్పట్లో వేటాడేవారని తేలింది. పెరూలో జరిపిన తవ్వకాల్లో ఇందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. దాదాపు 9వేల ఏండ్ల కిందట జీవించిన 427 మంది అవశేషాలు అక్కడ బయటపడ్డాయి. వీరిలో 27మంది వద్ద వేటాడే పనిముట్లు లభించాయి. వీరిలో 11 మంది మహిళలే. 17-19 ఏండ్లు ఉండే ఓ యువతి అవశేషాల వద్ద వేటాడే రాతి పనిముట్లు, కత్తి, ఇతర ఆయుధాలను గుర్తించారు. ఆమె ఎముకల తీరును బట్టి ఆమె మాంసం తినేవారని గుర్తించారు.